'భ్రమయుగం' వస్తోంది.. మరో 'విరూపాక్ష' అవుతుందా!
on Aug 17, 2023

ప్రత్యేకంగా హారర్-థ్రిల్లర్ జానర్ చిత్రాలను నిర్మించడానికి వైనాట్ స్టూడియోస్ సీఈఓ చక్రవర్తి రామచంద్ర, వైనాట్ స్టూడియోస్ వ్యవస్థాపకుడు ఎస్.శశికాంత్ తో కలిసి 'నైట్ షిఫ్ట్ స్టూడియోస్' పేరుతో ఒక జానర్-సెంట్రిక్ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. అంతేకాదు ఈ బ్యానర్ లో నిర్మించే మొదటి సినిమాని కూడా ప్రకటించారు.
నైట్ షిఫ్ట్ స్టూడియోస్ నిర్మిస్తున్న మొదటి చిత్రంలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తున్నారు. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'భ్రమయుగం' అనే ఆసక్తికర టైటిల్ పెట్టారు. చిత్ర ప్రకటన సందర్భంగా మమ్ముట్టి మాట్లాడుతూ.. ఇందులో తాను మునుపెన్నడూ పోషించని పాత్రను పోషిస్తున్నట్లు తెలిపారు.

హారర్-థ్రిల్లర్ జానర్ చిత్రాల కోసం ప్రత్యేకంగా బ్యానర్ ను స్థాపించడం ఆసక్తికరంగా మారింది. ఇక చిత్ర ప్రకటన సందర్భంగా విడుదల చేసిన టైటిల్ తో కూడిన కాన్సెప్ట్ పోస్టర్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఇటీవల తెలుగులో హారర్-థ్రిల్లర్ గా వచ్చిన 'విరూపాక్ష' ఘన విజయాన్ని సాధించింది. పోస్టర్ చూస్తుంటే 'భ్రమయుగం' కూడా అలాంటి మ్యాజిక్ చేస్తుందేమో అనిపిస్తోంది.
'భ్రమయుగం' చిత్రాన్ని కొచ్చి మరియు ఒట్టపాలంలో భారీస్థాయిలో చిత్రీకరిస్తున్నా రు. ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్డా లిజ్ ఇతర ముఖ్య పాతల్రు పోషిస్తున్నా రు. సినిమాటోగ్రాఫర్ గా షెహనాద్ జలాల్, ప్రొడక్షన్ డిజైనర్ గా జోతిష్ శంకర్, ఎడిటర్ గా షఫీక్ మహమ్మద్ అలీ, సంగీత దర్శకుడిగా క్రిస్టో జేవియర్ వ్యవహరిస్తున్నా రు. ఈ చిత్రం 2024 ప్రారంభంలో మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ మరియు హిందీభాషల్లో ఏక కాలంలో విడుదల కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



