'డర్టీ పాలిటిక్స్' మల్లికాషెరావత్ పై కేసు
on Jul 30, 2014
బాలీవుడ్ హాట్ భామ మల్లికాషెరావత్ ‘డర్టీ పాలిటిక్స్’ తో వార్తల్లోకెక్కింది. ఈమె నటిస్తున్న‘డర్టీ పాలిటిక్స్’ పోస్టర్ పై వివాదాలు కొనసాగుతూనే వున్నాయి. ఈ సినిమా పోస్టర్లలో మల్లికా షెరావత్ జాతీయ పతాకాన్ని ఒంటికి చుట్టుకుని సెక్సీ పోజులు ఇవ్వడం ఈ రగడకు కారణమవుతుంది. ఈ సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో మల్లికా షెరావత్ మీద కేసు నమోదైంది. జాతీయ పతాకాన్ని ఒంటికి చుట్టుకోవడం అంటే జాతీయ పతాకాన్ని అవమానించడమేనని, ఈ విషయంలో మల్లికా షెరావత్ మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ హై కోర్టులో ఒక సామాజిక కార్యకర్త ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు.