షూటింగ్‌లో హార్ట్ ఎటాక్‌తో కన్నుమూసిన సీనియర్ యాక్టర్
on Jun 24, 2022

సినీ, రంగస్థల నటుడు ఖాలిద్ షూటింగ్ సెట్స్ మీదే హార్ట్ ఎటాక్‌తో కుప్పకూలి మృతి చెందారు. శుక్రవారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆయన వయసు 70 సంవత్సరాలు. ఒక పాపులర్ మలయాళం కామెడీ సీరియల్ ద్వారా ఖాలిద్ మంచి పేరు సంపాదించుకున్నారు. స్టార్ హీరో టొవినో థామస్ సినిమా షూటింగ్ కొట్టాయం సమీపంలోని వైకోమ్‌లో జరుగుతోంది. అక్కడ షూటింగ్‌లో పాల్గొనడానికి వచ్చారు ఖాలిద్.
"ఈరోజు ఉదయం 9.30 గంటలకు మూవీ సెట్‌లోని బాత్‌రూమ్‌లో ఆయన కిందపడిపోయి కనిపించారు. యూనిట్ సభ్యులు ఆయనను దగ్గరలోని హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు కానీ, ఆయన ప్రాణాన్ని కాపాడలేకపోయారు." అని పోలీసులు తెలిపారు.
పాపులర్ సినిమాటోగ్రాఫర్స్ షైజు ఖాలిద్, జిమ్‌షి ఖాలిద్, డైరెక్టర్ ఖాలిద్ రెహమాన్ ఆయన కుమారులు. పోస్ట్-మార్టమ్, ఇతర ప్రొసీడింగ్స్ జరుగుతున్నట్లు పోలీసులు చెప్పారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



