మహేష్ బాబు ని ఆట పట్టించిన మంజుల..వీడియో వైరల్
on Apr 29, 2024
ఆఫ్ ది స్క్రీన్, ఆన్ ది స్క్రీన్ రికార్డులు కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అందుకు నిదర్శనమే ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో. రాజమౌళితో మూవీ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి సదరు వీడియో హుషారు ని తెస్తుంది. అంతే కాదు సోదరీమణులని కూడా గుర్తుకు తెస్తుంది.
మహేష్ రీసెంట్ గా ఒక ఫంక్షన్ కి హాజరయ్యాడు. సరికొత్త హెయిర్ స్టైల్ తో, సరికొత్త లుక్ తో ఒక రేంజ్ లో ఉన్నాడు. జుట్టు అయితే షోల్డర్స్ దాకా వచ్చింది. ఇక ఇదే ఫంక్షన్ కి మహేష్ అక్కయ్య మంజుల కూడా హాజరయ్యింది. మహేష్ ని చూసి వెంటనే దగ్గరకెళ్ళి జుట్టేంటి ఇంత పెంచావు అనేలా మహేష్ వెనకవైపు జుట్టుని చేత్తో తడిమింది. దీంతో మహేష్ ఒక నవ్వు నవ్వాడు. ఆ తర్వాత ఏం చెప్పాడో గాని మంజుల అయితే విపరీతంగా నవ్వింది. ఆ సమయంలో మంజుల భర్త ప్రముఖ నటుడు సంజయ్ కుమార్ కూడా అక్కడే ఉన్నాడు.
ఇక సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ అయితే అక్కా తమ్ముడి అనుబంధం అంటు కామెంట్స్ చేస్తున్నారు. అదే టైం లో మహేష్ లుక్ రాజమౌళి సినిమా కోసమే అని కూడా మాట్లాడుకుంటున్నారు. మంజుల, మహేష్ ఒకరికొకరు చాలా అభిమానంగా ఉంటారు. అందుకు నిదర్శనంగా మహేష్ హీరోగా మంజుల రెండు సినిమాలని కూడా నిర్మించింది. నాని కి సోలో ప్రొడ్యూసర్ గా పోకిరి కి సహనిర్మాత గాను వ్యవహరించింది. షో అనే సినిమాకి దర్శకత్వం కూడా చేసింది వహించింది.