‘శ్రీమంతుడి’ డబ్బింగ్ మొదలైంది
on Jul 3, 2015
.jpg)
సూపర్ స్టార్ Mahesh babu బర్త్ డే కానుకగా శ్రీమంతుడిని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సీరియస్ గా వర్క్ చేస్తోంది. శ్రీమంతుడు టాకీ పార్ట్ పూర్తవడంతో, డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. మహేష్ గా తన క్యారెక్టర్ కు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించేసాడట.
నాలుగు రోజుల్లో తన డబ్బింగ్ ఫినిష్ చేస్తాడని సమాచారం. దేవీశ్రీ ప్రసాద్ పాటలు కూడా చితక్కొట్టేసాడని ఇన్ సైడ్ టాక్. దీంతో మహేష్ సినిమాపై చాలా కాన్ఫిడెన్స్ గా వున్నాడట. అలాగే ఈ నెలలో ‘శ్రీమంతుడు’ ఆడియోని గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్, పూర్ణ, సనమ్ శెట్టిలు మొదలగు నటి నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



