అప్పుడు రజినీకాంత్, ఇప్పుడు ప్రభాస్.. మహేష్ మాస్టర్ మైండ్!
on Oct 7, 2025

మహేష్ బాబు (Mahesh Babu) సినీ రంగంలో సూపర్ స్టార్ గా ఎదగడమే కాకుండా.. బిజినెస్ రంగంలోనూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఏషియన్ సినిమాస్ తో కలిసి హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో 'AMB సినిమాస్' అనే మల్టీప్లెక్స్ ని స్టార్ట్ చేసి, సూపర్ సక్సెస్ అయ్యారు. 2018లో రజినీకాంత్ '2.0' సినిమాతో ప్రారంభమైన ఈ మల్టీప్లెక్స్.. హైదరాబాద్ సినీ ప్రియులకు బెస్ట్ ఆప్షన్స్ లో ఒకటిగా మారింది.
ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో త్వరలో మహేష్ మరో మల్టీప్లెక్స్ ని హైదరాబాద్ సినీ ప్రియులకు అందించబోతున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో 'AMB క్లాసిక్' పేరుతో ఈ మల్టీప్లెక్స్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. ఏడు స్క్రీన్ లతో రూపొందుతోన్న ఈ మల్టీప్లెక్స్, 2026 సంక్రాంతికి ఘనంగా ప్రారంభం కానుందని సమాచారం.
2026 సంక్రాంతికి ప్రభాస్ 'ది రాజా సాబ్', చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' వంటి సినిమాలు విడుదల కానున్నాయి. వీటిలో 'రాజా సాబ్' ముందు విడుదలవుతుంది కాబట్టి, దాంతోనే 'AMB క్లాసిక్' ప్రారంభమయ్యే అవకాశముంది. మరి మహేష్ కొత్త మల్టీప్లెక్స్ కి ప్రభాస్ మూవీ ఎలాంటి ఆరంభాన్ని ఇస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



