'బాహుబలి' రికార్డులు..మహేష్ ఊహించలేదట
on Jul 17, 2015
.jpg)
ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కించిన చారిత్రాత్మక మూవీ 'బాహుబలి'. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇండియా సినిమా రికార్డులను బద్దలుకొడుతూ విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఇప్పటికే ఈ సినిమాని చూసిన ఇండియా సినిమా దిగ్గజాలు ఈ సినిమాపై పొగడ్తల వర్షం కురిపించారు.
లేటెస్ట్ గా వీరి జాబితాలో చేరిపోయాడు మన తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు. హాలిడే కోసం విదేశాలు వెళ్ళిన మహేష్ ఇండియాకి తిరిగొచ్చిన వెంటనే 'బాహుబలి' సినిమాని చూశాడు.
''ఈ సినిమా చూస్తున్నప్పుడు తన రొమాలు నిక్కపొడుచుకున్నట్టు మహేష్ తెలిపారు. బాహుబలి తెలుగు వారికి గర్వం కారణం అని అన్నాడు. ఒక తెలుగు సినిమా మనదేశంలోను, బయట రికార్డులను కొల్లగొడుతుందని ఊహించలేదని, దానిని రాజమౌళి నిజం చేసాడని అన్నారు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ టెరిఫిక్ గా వుందని, ఇంతటి గొప్ప చిత్రాన్ని తీసినందుకు ఆర్కా మీడియా వారికి కృతజ్ఞతలు తెలియజేసారు. ప్రభాస్, రానా పడిన కష్టానికి ఫలితం దక్కిందని, మీకూ మీ టీమ్‌కు కంగ్రాట్యులేషన్స్ రాజమౌళి'' అని ట్విట్టర్ ద్వార తన ఫీలింగ్స్ తెలియజేసాడు మహేష్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



