తానాకి.. మహేష్ ఝలక్!!
on Apr 30, 2015
.jpg)
ఈయేడాది జులైలో అమెరికాలో జరిగే తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) వేడుకలకు మహేష్ బాబు హాజరవుతాడని, ఈ వేడుకలకు పిలిచినందకు మహేష్ రూ.1.5 కోట్లు డిమాండ్ చేశాడని వార్తలొచ్చాయి. ఈ డబ్బుని ఓ ఛారిటీకి మహేష్ అందించాడనికి కూడా చెప్పుకొన్నారు. అయితే ఇప్పుడు తానా వేడుకలకు మహేష్ వెళ్లడం లేదట. దానికి కారణం.. రహస్యంగా ఉంచాల్సిన విషయాలు సైతం తానా ద్వారానే బయటకు పొక్కినందుకు మహేష్ సీరియస్ అయ్యాడని తెలిసింది. రూ.1.5 కోట్లు మహేష్‌కి ముట్టజెప్పిన విషయం మీడియాకు లీకవ్వడంపై మహేష్ చాలా సీరియస్‌గా ఉన్నాడట. తానా సభ్యులే ఈ విషయాన్ని మీడియాకు లీక్ చేశారని మహేష్ భావిస్తున్నాడట. అందుకే మీ ఉత్సవాలకు వచ్చేది లేదని తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. మహేష్ నిర్ణయంపై తానా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎలాగైనా సరే.. మహేష్‌ని తానాకు రప్పించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అవసరమైతే మహేష్‌కి క్షమాపణ చెప్పయినా సరే.. ఈ వ్యవహారం సర్దుబాటు చేయాలని భావిస్తోందని సమాచారం. మరి మహేష్ కరుగుతాడో లేదో..?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



