మహేష్ తో శేఖర్ కమ్ముల సినిమా?
on Jul 4, 2015
.jpg)
టాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ లలో మహేష్ బాబు, శేఖర్ కమ్ముల కాంబో ఒకటి. ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడో రావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూనే వస్తోంది. గతంలో శేఖర్ మంచి ఫామ్ లో వున్నప్పుడు మహేశ్ బాబు అతనితో సినిమా చేస్తానని మాట ఇచ్చాడట. ఆ తరువాత శేఖర్ మహేష్ కి కొన్ని స్టోరీలు చెప్పినా అవి వర్క్ అవుట్ అవ్వలేదు. ఆ తరువాత వాళ్ళిద్దరూ తమ ప్రాజెక్ట్ లలో బిజీ అయిపోయారు.
లాస్ట్ ఇయర్ నయనతారతో శేఖర్ తీసిన లేడి ఓరియంటెడ్ చిత్రం అనామిక ఫ్లాప్ అవ్వగా.. మహేష్ చేసిన రెండు భారీ బడ్జెట్ మూవీలు 'నేనొక్కడినే', 'ఆగడు' సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. ప్రస్తుతం మహేష్ నటించిన శ్రీమంతుడు మూవీ రిలీజ్ కి సిద్దంగా వుండగా..శేఖర్ కమ్ముల చేతిలో ఎలాంటి ప్రాజెక్టులు లేవు.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం..లేటెస్ట్ గా శేఖర్ కమ్ముల మహేష్ ని కలిసి ఓ స్టొరీ వినిపించాడట. ఆ స్టొరీ లైన్ మహేష్ కి నచ్చడంతో డెవలప్ చేయమని చెప్పాడట. దీంతో ఇంతకాలానికి మహేష్ తో సినిమా చేసే ఛాన్స్ రావడం తో శేఖర్ ఎంతో సంతోషంగా వున్నాడట .మహేష్ కూడా శ్రీకాంత్ అడ్డాల తో ‘బ్రహ్మోత్సవం’ చిత్రం చేయబోతున్నాడు..ఈ సినిమా పూర్తి కాగానే శేఖర్ తో సినిమా చేస్తాడని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



