మహేష్ స్టార్డమ్ ఇంతేనా?
on Oct 26, 2018
సూపర్ స్టార్డమ్ ఎంజాయ్ చేస్తున్న మహేశ్‌బాబుకు భారీ షాక్! 'మహేశ్ స్టార్డమ్ ఇంతేనా?' అని ప్రేక్షకులు నోరెళ్లబెట్టే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఈ నెల 27న... అనగా శనివారం అమెరికాలో మహేశ్ ముఖ్య అతిథిగా ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్ ప్లాన్ చేసింది. గతంలో చిరంజీవి అతిథిగా ఒక ఈవెంట్ చేశారు కదా! అటువంటి ఈవెంట్ అన్నమాట! ఇందులో వందల డాలర్స్ పెట్టి టికెట్స్ కొన్న ఎన్నారైలతో మహేశ్ ముచ్చటిస్తారు. ఫొటోలు దిగుతారు. ఆటోగ్రాఫ్స్ ఇస్తారు.
ఈవెంట్ ద్వారా వచ్చిన డబ్బును మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ శాశ్వత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం ఉపయోగించాలని నిర్ణయించారు. ఈవెంట్ హక్కులను కోటిన్నరకు హీరో శ్రీకాంత్ స్నేహితుడికి చెందిన కంపెనీకి ఇచ్చారు. గతంలో చిరంజీవి ఈవెంట్‌కి కోటి రూపాయలకు ఇచ్చారు. ఆ ఈవెంట్ నిర్వహణలో నిధుల గోల్మాల్ జరిగిందనీ, కోటి రూపాయల కంటే ఎక్కువ వచ్చాయనీ, ఈవెంట్ ద్వారా శ్రీకాంత్ స్నేహితుడు బాగా లబ్ధి పొందారనీ నటుడు నరేశ్ ఆరోపించడం... తరవాత సైలెంట్ కావడం... శ్రీకాంత్, శివాజీరాజాతో చేతులు కలపడం... వంటి విషయాలు తెలిసినవే. అప్పట్లో చిరంజీవి కార్యక్రమం ప్లాప్ షో అని వార్తలు వచ్చాయి. అయితే.. చిరంజీవి ఈవెంట్‌కి వచ్చిన అమెరికాలోని తెలుగు ప్రేక్షకుల సంఖ్య ఎక్కువే. చాలామంది ఫొటోల్లో కనిపించారు. మహేశ్ ఈవెంట్‌కి అంతకంటే ఎక్కువమంది వస్తారని ఆశించిన ఈవెంట్ నిర్వాహకులకు భారీ షాక్ తగిలింది. కేవలం 20 అంటే 20 టికెట్స్ అమ్ముడు కావడం వలన శనివారం నిర్వహించాల్సిన ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసినట్టు అధికారికంగా చెప్పలేదు. అలాగని, ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్టు ఎవరికీ సమాచారం ఇవ్వడంలేదు. అందరూ గుట్టుచప్పుడు కాకుండా వున్నారు. క్యాన్సిల్ చేయడం కంటే మహేశ్ ఈవెంట్‌కి 20 టికెట్స్ అమ్ముడు కావడం ఏంటని తీవ్రంగా ఆలోచిస్తున్నార్ట!
ఏం సందేహం లేదు... టాలీవుడ్ టాప్ హీరోల్లో మహేశ్ ఒకరు. తెలుగులో సూపర్‌స్టార్. ఆయనకు ఆశేషమైన సంఖ్యలో అభిమానులు వున్నారు. ముఖ్యంగా అమెరికాలో మహేశ్ సినిమాలు అవలీలగా మిలియన్ డాలర్ క్లబ్లో చేరతాయి. అదీ మహేశ్ స్టామినా! అమెరికాలోని తెలుగు వారికి ఇష్టమైన హీరోల్లో ఒకరైన మహేశ్ అక్కడ ఓ కార్యక్రమానికి అతిథిగా హాజరవుతారని తెలిసినా ప్రేక్షకులు ఆసక్తి చూపించడకపోవడం ఆశ్చర్యమే.