మహేష్ `హంబుల్` రిక్వెస్ట్
on Aug 8, 2019
మహేష్ ఒక వైపు సినిమాలతో బిజీ గా ఉంటూనే మరో వైపు బిజినెస్ లో కూడా యాక్టీవ్ గా ఉంటున్నాడు. ఇప్పటికే మల్టీప్లెక్స్ థియేటర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటె ...గత కొన్ని రోజులుగా మహేష్ బ్రాండ్ దుస్తులను స్టార్ట్ చేస్తున్నాడంటూ న్యూస్ వచ్చాయి. ఇక ఫాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తోన్న ఆ సమయం రానే వచ్చింది. బుధవారం పార్క్ హయత్ లో ` ది హంబుల్ ` బ్రాందీ దుస్తుల్ని స్పోయల్ అనే సంస్థ తో కలిసి ఆరంభించారు. 160 టైప్స్ దుస్తుల్ని ప్రెసెంట్ కస్టమర్స్ కోసం అందుబాటులోకి తెచ్చారు. ఇందులో యంగ్ స్టర్స్ నుంచి వృద్ధుల దాకా అందుబాటులో ఉంటాయని , ధరలు కూడా అందరికి అందుబాటులోనే ఉంటాయని నిన్న ప్రకటించారు. ఇక వరుస సక్సెస్లతో దూసుకెళ్తోన్న బిజినెస్ మాన్ బిజినెస్ లో కూడా సక్సెస్ కావాలని కోరుకుందాం. ఇక ప్రస్తుతం మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా లో నటిస్తున్నాడు. అన్నపూర్ణలో వేసిన సెట్ లో ఈ సినిమా షూటింగ్ శరవేగం గా నడుస్తోంది.