`మహర్షి` మెగాస్టార్ కు తెగ నచ్చేసాడు!!
on May 10, 2019

మహేష్ నటించిన మహర్షి చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రజంట్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. అలాగే మహేష్ బాబు పర్ఫార్మెన్స్ కు, రైతులకు సంబంధించిన కాన్సెప్ట్ కు అటు ప్రేక్షకుల నుంచి, ప్రేక్షకులు, సినీ పరిశ్రమలో ప్రముఖుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. సినిమా చూసిన సెలబ్రిటీస్ తమ ఆనందాన్ని, అభిప్రాయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఆలిస్ట్ లో చేరారు. అవును మహర్షి సినిమా చూసిన చిరంజీవి చిత్ర యూనిట్ ని అభినందించాడట. ఈ విషయాన్ని ఈ రోజు పాత్రికేయుల సమావేశంలో చిత్ర యూనిట్ మీడియాకు తెలిపారు. `` చిరంజీవి గారు సినిమా చూసారనీ, ఆయనకు బాగా నచ్చిందనీ, మహేష్ గారి నటనకు ఆయన ఫిదా అయ్యారనీ సక్సెస్ మీట్ లో తెలిపాడు దేవి శ్రీప్రసాద్. ముఖ్యంగా వీకెండ్ అగ్రీకల్చర్ కాన్సెప్ట్ చిరంజీవి కి బాగా నచ్చేసిందనీ, దాని గురించి చాలా సేపు మాట్లాడరనీ మీడియాకు తెలిపాడు దేవి. మహర్షిలో వీకెండ్ వ్యవసాయం అనే కాన్సెప్ట్ బాగా ఆకట్టుకుంటుందట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



