బాలకృష్ణ మహాదేవనాయుడు ఫస్ట్ లుక్
on May 4, 2011
బాలకృష్ణ "మహాదేవనాయుడు" ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలయ్యింది. వివరాల్లోకి వెళితే శ్రీ కీర్తి క్రియేషన్స్ పతాకంపై, నందమూరి నటసింహం, యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తూండగా, సలోనీ, లక్ష్మీ రాయ్, ఛార్మి హీరోయిన్లుగా,పరుచూరి మురళి దర్శకత్వంలో, యమ్.యల్.కుమార్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం "మహాదేవనాయుడు". ఈ చిత్రంలో బాలకృష్ణ తాత, తండ్రి, మనవడుగా త్రిపాత్రాభినయంలో నటించటం విశేషం.
(2).jpg)
ఈ మూడు పాత్రల్లో తాత పాత్ర ఫ్యాక్షనిస్టు కాగా మనవడు తెలివైన విలేఖరిగా, తండ్రి శాంతికాముకుడి పాత్రలో నటిస్తున్నారు. బాలకృష్ణ "మహాదేవనాయుడు" సినిమాకి యమ్.యమ్.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగంతా దాదాపు పూర్తి చేసుకున్నబాలకృష్ణ "మహాదేవనాయుడు" మూవీ జూలైలో విడుదలకు సిద్ధమవుతోంది. నిజానికి బాలకృష్ణ "మహాదేవనాయుడు" సినిమా బాలకృష్ణ జన్మదినాన విడుదల కావలసింది. కానీ ఫెడరేషన్ సమ్మె మూలంగా బాలకృష్ణ "మహాదేవనాయుడు" విడుదలలో ఆలస్యం అనివార్యమైంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



