'మహా సముద్రం' ట్రైలర్ విడుదల.. పోటాపోటీగా శర్వానంద్, సిద్ధార్థ్
on Sep 23, 2021

శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'మహా సముద్రం'. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా అక్టోబరు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీమ్ ట్రైలర్‌ని విడుదల చేసింది. లవ్, యాక్షన్ సన్నివేశాలతో సాగే ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
'ఆర్ ఎక్స్ 100' లాంటి బ్లాక్ బస్టర్ తరువాత అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో పాటు.. శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటించిన సినిమా కావడంతో 'మహా సముద్రం'పై మంచి అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టే తాజాగా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఎమోషనల్, యాక్షన్ సీన్స్ తో ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంది. శర్వానంద్, సిద్ధార్థ్ పోటీపడి నటించారు. జగపతిబాబు, రావు రమేష్ ల పాత్రలు కూడా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాయి. డైలాగ్స్, బ్యాక్రౌండ్ స్కోర్ ట్రైలర్ కి స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పాలి. "సముద్రం చాలా గొప్పది మహా.. చాలా రహస్యాలు తనలోనే దాచుకుంటుంది", "నువ్వు సముద్రం లాంటి వాడివి అర్జున్.. నీలో కలవాలని అన్ని నదులు కోరుకుంటాయి" వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
'మహా సముద్రం' చిత్రాన్ని ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. దసరా కానుకగా విడుదలవుతున్న ఈ మూవీ ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



