ENGLISH | TELUGU  

దత్ , దీక్షిత్ మధ్య శృంగార దావానలం… నిజమేనట!

on May 13, 2017

 

బాలీవుడ్ లో ఎఫైర్లు సహజం! ఆ ఎఫైర్లు చల్లారిపోయినా… వాటి గురించి జనం మాట్లాడుకోవటం మానేయరనేది సత్యం! ఇందుకు బోలెడు ఉదాహరణలు. ఇప్పటికీ… అమితాబ్, రేఖా ప్రేమాయాణమంటే జనాలకి అమితమైన ఆసక్తి! అలాగే, సల్మాన్, ఐశ్వర్య మొదలు నిన్న మొన్నటి రణబీర్, కత్రీనా కైఫ్ ల రియల్ లైఫ్ రొమాన్స్ వరకూ బీ – టౌన్ లవ్ స్టోరీస్ మీడియాలో శాశ్వతంగా అలా నిలిచిపోతాయి! ఆ లిస్ట్ లోకి వచ్చే వన్నాఫ్ ది ఎవర్ థ్రిల్లింగ్ రొమాన్స్… సంజయ్, మాధురీలది!

1980లు, 90లలో సంజయ్ దత్ పెద్ద సంచలనం! సునీల్ దత్, నర్గీస్ దత్ లాంటి బాలీవుడ్ లెజెండ్స్ వారసుడు. వచ్చీ రావటంతోనే బాగానే సక్సెస్ లు, ఇమేజ్ సంపాదించాడు. వాటితో పాటే వివాదాలు మనోడి వెంట పడి పరుగెత్తుకొచ్చేవి! ఇక 1993 ముంబై బాంబ్ బ్లాస్టుల కేసులో సంజు బాబాకి జైలు శిక్ష పడటం కూడా మనకు తెలిసిందే కదా! సరిగ్గా ఆ కేసులో మొదటి సారి దత్ అరెస్ట్ అయినప్పుడు … ఆయన ఖల్ నాయక్ సినిమా విడుదలైంది. అందులో హీరోయిన్ … గార్జియస్ గాడెస్ మాధురీ!

మాధురీ, సంజయ్ లు ఖల్ నాయక్ తో పాటూ సాజన్ లాంటి సూపర్ హిట్ సినిమా కూడా చేశారు. ఆ క్రమంలోనే ఆజానుబాహుడి ఆలింగనంలో అందగత్తె  మాధురీ కరిగిపోయిందని విపరీతంగా ప్రచారం జరిగింది. కాని, అనూహ్యంగా సంజయ్ దత్ జైలు పాలు కావటంతో మాదురీ ఆ రిలేషన్ కు పుల్ స్టాప్ పెట్టేసి కెరీర్ కొనసాగించింది. 2002లో దేవదాస్ సినిమా చేశాక పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయి ఇప్పుడు మళ్లీ ముంబైలో సెటిల్ అయింది. అయితే, ప్రస్తుతం ఇద్దరు పిల్లల తల్లైన 49ఏళ్ల మాదురిని ఇంకా గతం విడిచిపెట్టడం లేదు. రణబీర్ కపూర్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు రాజు హిరానీ సంజయ్ దత్ బయోపిక్ తీస్తున్నాడు. ఆ సినిమాలో నటించమని ఆయన మాధురీ దీక్షిత్ నేనేను అప్రోచ్ అయ్యాడట. కాని, అవన్నీ ఒట్టి మాటలేనని కొట్టిపారేసింది మధు…

రాజు హిరానీ సంజయ్ దత్ బయోపిక్ లో మాదురీనైతే యాక్ట్ చేయమనే లేదు కాని… దత్ కు, దీక్షిత్ కు వున్న లింక్ మాత్రం మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఆ ఎఫైర్ గురించి మాధురీని అడిగితే… ఆమె అది ఇప్పుడు తనకు సంబంధించినంత వరకూ అప్రస్తుతం అని సమాధానమిచ్చింది. తాను జీవితంలో చాలా దూరం వచ్చేశానని చెప్పింది!

సంజయ్ దత్ తో ఎఫైర్ గురించి అడిగితే … అసలు మా మధ్య అలాంటిదేం లేదని చెప్పుకుండా … మాధురీ అదిప్పుడు అప్రస్తుతం అనటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఖండిచకపోవటం…. సదరు ఎఫైర్ గాసిప్ నిజమేనని నిరూపించేసింది!


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.