రామ్ మూవీపై మాధవన్ రియాక్షన్
on Jun 12, 2021
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో రామ్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో తమిళ నటుడు మాధవన్ విలన్ గా నటించనున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాధవన్ తాజాగా దీనిపై స్పందించాడు.
రామ్-లింగుస్వామి కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో తాను నటించడం లేదని మాధవన్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ‘‘వండర్ ఫుల్ దర్శకుడు లింగుస్వామితో పనిచేయడాన్ని నేను ప్రేమిస్తాను. కానీ, ప్రస్తుతం ఆయన చేస్తున్న తెలుగు సినిమాలో నేను విలన్ గా నటిస్తున్నట్టు వచ్చిన వార్తలో ఎలాంటి నిజం లేదు’’ అంటూ స్పష్టం చేశారు. కాగా మాధవన్ గతంలో లింగుస్వామి దర్శకత్వంలో ‘వెట్టాయి’ మూవీలో నటించాడు.
రామ్-లింగుస్వామి కాంబినేషన్ లో వస్తున్న మూవీ తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న.. ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
Also Read