8 కోట్లు వసూలు చేసిన రామ్ చరణ్ మా వీరన్
on Jun 23, 2011
8 కోట్లు వసూలు చేసిన రామ్ చరణ్ మా వీరన్ అని కోలీవుడ్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే తెలుగులో గీతా ఆర్ట్స్ పతాకంపై, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, అపజయమెరుగని యువ దర్శకుడు యస్.యస్.రాజమౌళి దర్శకత్వంలో, మెగా నిర్మాత అల్లు అరవింద్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం "మగధీర". ఈ సినిమా తెలుగులో విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టించి, 75 యేళ్ళ తెలుగు సినిమా బాక్సాఫీస్ చరిత్రనే తిరగరాసింది. అటువంటి "మగధీర" సినిమాని తమిళంలోకి "మా వీరన్" పేరుతో అనువదించి విడుదల చేశారు.
ఈ "మా వీరన్" చిత్రాన్ని తమిళనాడులో గీతా ఆర్ట్స్ మరియూ ఉదయనిధి స్టాలిన్ కలసి జియంట్ మూవీస్ బ్యానర్ పై విడుదల చేశారు. ఈ సినిమాని తమిళంలోకి అనువదించటానికి అయిన ఖర్చు 1.5 cr అయితే, ఈ "మా వీరన్" సినిమా అక్కడ ఇప్పటి వరకూ వసూలు చేసినది ఎనిమిది కోట్లు. ఇంకా ఈ "మా వీరన్ " సినిమాకి రోజు రోజుకీ ప్రేక్షకాదరణ విపరీతంగా పెరుగుతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఈ లెక్కన ఈ "మా వీరన్" సినిమా తమిళ నాడులో కూడా చరిత్ర సృష్టించే అవకాశాలున్నాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
