దళపతి మూవీతో ధోనీ డెబ్యూ
on Aug 16, 2023

ప్రముఖ క్రికెటర్ ధోనీ సిల్వర్ స్క్రీన్ డెబ్యూ గురించి చాలా కాలంగా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంతకం చేశారంటూ రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవల తన ప్రొడక్షన్ హౌస్ లో తెరకెక్కించిన సినిమాలోనూ ఆయన ఓ స్పెషల్ కేరక్టర్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఎల్‌జీఎం సినిమాలో కచ్చితంగా ధోనీ నటించారని కన్‌ఫర్మ్ గా చెప్పిన వారు కూడా లేకపోలేదు. అయితే అవన్నీ తప్పుడు వార్తలేనని తేలింది. లేటెస్ట్ గా ధోనీ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ గురించి మరో న్యూస్ వైరల్ అవుతోంది. వెంకట్ ప్రభు డైరక్షన్‌లో సినిమా చేయడానికి ధోనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. ధోనీకి దళపతి విజయ్ అంటే చాలా ఇష్టమట. అందుకే విజయ్ సినిమా అవకాశం వచ్చేసరికి కాదనలేకపోయారట మిస్టర్ క్రికెటర్. ఈ ఏడాది అక్టోబర్‌లోగానీ, నవంబర్‌లోగానీ సినిమా మొదలవుతుంది. దళపతి విజయ్ ప్రస్తుతం ఫారిన్ ట్రిప్‌లో ఉన్నారు. ఇటీవల లోకేష్ కనగరాజ్ లియో సినిమాను కంప్లీట్ చేశారు విజయ్. ఇప్పుడు ఫారిన్‌లో రెస్ట్ తీసుకుంటున్నారు. త్వరలో రాగానే వెంకట్ ప్రభు సినిమా మొదలవుతుంది.
ఈ సినిమా మొదలుపెట్టగానే ధోనీ కూడా షూటింగ్‌లో జాయిన్ అవుతారు. ఈ విషయాన్ని దర్శకుడు వెంకట్ ప్రభు తండ్రి గంగై అమరన్ చూచాయగా చెప్పారు. ధోనీకి తమిళనాడుతో స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. ఆయన చెన్నై సూపర్ కింగ్స్ కి కెప్టెన్‌గా ఉన్నప్పటి నుంచీ ఆయన్ని ఫ్యాన్స్ తెగ ఇష్టపడేవారు. ఇప్పుడు దళపతి సినిమాలో ధోనీ నటిస్తున్నారనే వార్త రాగానే వారి ఆనందానికి అవధుల్లేవు. దళపతి 68వ సినిమాను ఏజీయస్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. జ్యోతిక, జెయ్, ప్రియా భవానీ శంకర్, ప్రేమ్‌జీ అమరన్ కీ రోల్స్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



