ఎమ్మెల్యేగా బాలయ్యకు మొదటి పుట్టినరోజు
on Jun 6, 2014

‘చెప్పండి వాడికి.. సెంటరైనా, స్టేటైనా.. పొజిషనైనా, అపొజిషనైనా.. పవరైనా, పొగరైనా.. నేను దిగనంతవరకే.. ఒన్స్ ఐ స్టెప్ ఇన్.. హిస్టరీ రిపీట్స్’. ‘లెజెండ్’ సినిమాలో అత్యంత రౌద్రంగా నందమూరి నటసింహం బాలకృష్ణ పలికిన సంభాషణల్లో ఇది కూడా ఒకటి. అయితే.. ఆయన తాను పలికిన సంభషణల్లో ఏమాత్రం అతిశయోక్తి లేదని ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ద్వారా నిరూపించారు. భారీ మెజారిటీతో హందూపురం ఎమ్మెల్యేగా గెలిచి.. ‘హిస్టరీ రిపీట్’ చేశారు. ఈనెల జూన్ 10న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. ఈ పుట్టినరోజు వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు నందమూరి అభిమానులు సన్నాహాలు చేసుకొంటున్నారు. నాచారం, రామకృష్ణ స్టూడియోస్‌లో నందమూరి అభిమానుల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహింపబడనున్న ఈ పుట్టినరోజు వేడుకలకు నంబూరి సతీష్, జి.ఎల్.శ్రీధర్, బి.బి.జి.తిలక్‌లు కార్య నిర్వహకులుగా వ్యవహరిస్తారు. తమ నందమూరి వంశ కథానాయకుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ పుట్టినరోజు వేడుకల్లో పాలుపంచుకొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ నాచారం తరళిపోనున్నారు. ఈ సందర్భంగా వారు రక్తదాన శిబిరాలు సైతం నిర్వహించనున్నారు!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



