ఇండస్ట్రీ హిట్ దిశగా 'లోకా'.. ఇది కదా సక్సెస్ అంటే..!
on Sep 16, 2025

ఫిమేల్ ఓరియెంటెడ్ సూపర్ హీరో సినిమాలు రూపొందడమే అరుదు. అలాంటిది ఆ తరహా సినిమా వచ్చి, ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందని ఊహించగలమా?. మలయాళ చిత్ర పరిశ్రమలో 'లోకా' అలాంటి ఘనతనే సాధించే అవకాశం కనిపిస్తోంది. (Lokah Chapter 1 Chandra)
కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) ప్రధాన పాత్ర పోషించిన 'లోకా' చిత్రాన్ని వేఫేరర్ ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ నిర్మించారు. ఈ సూపర్ హీరో ఫిల్మ్ కి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 28న థియేటర్లలో అడుగుపెట్టిన 'లోకా' మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. ఆరు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో, పదమూడు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్ లో చేరింది. ఇదే జోరులో తాజాగా రూ.250 కోట్ల గ్రాస్ మార్క్ ని కూడా అందుకుంది. (Lokah collections)
మలయాళ సినీ చరిత్రలో రూ.250 కోట్ల క్లబ్ లో చేరిన రెండో సినిమా 'లోకా' కావడం విశేషం. రూ.265 కోట్ల గ్రాస్ తో ప్రస్తుతం అక్కడ 'లూసిఫర్ 2: ఎంపురాన్' టాప్ లో ఉంది. ప్రస్తుత 'లోకా' జోరు చూస్తుంటే.. త్వరలో 'లూసిఫర్ 2'ని దాటేసి, మలయాళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచినా ఆశ్చర్యంలేదు.
సౌత్ ఇండియాలో ఇంతవరకు రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ లేదు. అలాంటిది 'లోకా' ఏకంగా రూ.250 కోట్ల క్లబ్ లో చేరడమే కాకుండా, ఇండస్ట్రీ హిట్ దిశగా పయనించడం అనేది సంచలనమనే చెప్పాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



