మార్చి 21న లెజెండ్ సెన్సార్
on Mar 18, 2014

భారీ అంచనాలతో తెరకెక్కుతున్న బాలయ్య "లెజెండ్" చిత్రం రోజురోజుకి అంచనాలను మరింత పెంచేస్తున్నాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని ఇప్పటికే ట్రైలర్స్ చూసినవాళ్ళందరికీ అర్థమయ్యింది.
"సింహ" వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత బాలయ్యతో చేస్తున్న రెండో చిత్రం కావడం వలన దర్శకుడు బోయపాటి ఓ సవాల్ గా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. మార్చి 21న ఈ చిత్రం సెన్సార్ కు వెళ్ళబోతుంది. మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
వారాహి చలన చిత్ర సాయి కొర్రపాటి సమర్పణలో, 14రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయికలు. జగపతి బాబు విలన్ పాత్రలో మొదటిసారిగా నటిస్తున్నాడు. హంస నందిని ఓ ఐటెం సాంగ్ లో నటించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



