'ఎన్టీఆర్ 30' లాంచ్ లేదు.. డైరెక్ట్ గా షూట్ స్టార్ట్!
on Jan 31, 2023
దాదాపు అందరు హీరోల అభిమానులు ఏదో ఒక అప్డేట్ తో సంతోషంగా ఉన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తమ హీరో తదుపరి సినిమా అప్డేట్లు రాక, సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియక తీవ్ర నిరాశలో ఉన్నారు. ఎన్టీఆర్ గత చిత్రం 'ఆర్ఆర్ఆర్' విడుదలై పది నెలలు దాటింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ సినిమా ప్రకటన వచ్చి కూడా ఎనిమిది నెలలు దాటిపోయింది. అయినా ఈ సినిమా పట్టాలెక్కకపోవడంతో అసలు ఈ సినిమా ఉందా లేదా?.. ఉంటే అప్డేట్స్ ఇవ్వండి అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో జనవరి 1న మూవీ టీమ్ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ ఫిబ్రవరిలో షూట్ మొదలవుతుందని, వచ్చే ఏడాది ఏప్రిల్ 5న మూవీ విడుదలవుతుందని అనౌన్స్ చేశారు. అయితే అప్డేట్ వచ్చి నెల రోజులు అయిపొయింది. ఫిబ్రవరి కూడా వచ్చేసింది. అయినా ఇంతవరకు మూవీ లాంచ్ కి సంబంధించిన అప్డేట్ కూడా లేదు. దీంతో అసలు ఫిబ్రవరిలోనైనా షూటింగ్ మొదలవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈసారి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు అని, సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయని సమాచారం.
ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ తో కలిసి యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఇటీవల యువసుధ ఆర్ట్స్ ఆఫీస్ సినీ ప్రముఖుల సమక్షణంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ క్రమంలో మూవీ లాంచ్ కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించకుండా.. నేరుగా షూటింగ్ కి వెళ్లే అవకాశముందని అంటున్నారు. ఫిబ్రవరి నెలాఖరులో ఓ చిన్న షెడ్యూలు ప్లాన్ చేస్తున్నారట. మార్చి నుంచి ఇక పూర్తిస్థాయిలో షూటింగ్ మొదలు కానుందని సమాచారం. మొదట హైదరాబాద్ లోని శంషాబాద్ దగ్గర చిత్రీకరణ జరగనుందని, ఇప్పటికే అక్కడ సెట్ వర్క్ కూడా పూర్తి కావచ్చిందని తెలుస్తోంది. హైదరాబాద్ షెడ్యూలు ముగిసాక గోవాలో ఒక షెడ్యూల్ ఉంటుందట. ఈ మూవీ షూటింగ్ ఎక్కువగా హైదరాబాద్, గోవాలో జరగనుందని వినికిడి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
