అయ్యో పాపం శృతి ఇలా అయిపోయింది ఏంటి!
on Jan 18, 2023
.webp)
ఈసారి సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డిలు వీర విహారం చేస్తున్నాయి. వీటికి పోటీగా వచ్చిన అజిత్ తెగింపు, విజయ్ వారసుడు చిత్రాలు తేలిపోవడంతో అందరి దృష్టి బాలయ్య, చిరు చిత్రాలపైనే నిలిచి ఉంది. ఈ రెండు చిత్రాలలో సంక్రాంతి పండుగను గెలిచే సత్తా వాల్తేరు వీరయ్యకే ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఈ పండుగ సెలవులను క్యాష్ చేసుకుంటే వాల్తేరు వీరయ్యకు బాక్సాఫీస్ వద్ద తిరుగులేకుండా ఉండవచ్చు. అదే సమయంలో వీర సింహారెడ్డిని కూడా అంత సులభంగా తీసిపారేయలేం. మాస్ ఆడియన్స్‌ను మరీ ముఖ్యంగా టిడిపి నాయకులను, కార్యకర్తలను, సానుభూతి పరులను, వైసీపీ అంటే ద్వేషించే వారిని విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ చిత్రం మాస్ యాక్షన్ ఓరియంటెడ్ చిత్రంగా తన సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తుంది. ఏపీ సీఎం జగన్ ను ఏపీలోని వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన ఈ చిత్రంపై నందమూరి అభిమానులు ఎంతో పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంటే వైసీపీ వారు మాత్రం అసలు బాగాలేదని ప్రచారం చేస్తున్నారు.
మరోవైపు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గానే వచ్చినా వాల్తేరు వీరయ్య ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా అలరిస్తూ సంక్రాంతి పోరులో ఓ అడుగు ముందే ఉంది. ఇక ఈ రెండు చిత్రాలను ఒకే నిర్మాణ సంస్థ అయినా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం. రెండు చిత్రాలలో హీరోయిన్‌గా శృతిహాసన్ నటించడం మరో విశేషం. బాలయ్య సరసన వీరసింహారెడ్డిలో, చిరు సరసన వాల్తేరు వీరయ్యల్లో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. కానీ ఈ రెండు చిత్రాలలోనూ ఆమెకు సరైన పాత్ర అంటూ ఏదీ లేదు. ఏదో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే పాత్రలు కావడం, కేవలం పాటలకే పరిమితం కావడం శృతిహాసన్ వంతయింది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య రెండింటిలోనూ శ్రుతి పరిస్థితి దాదాపు ఇంచుమించు ఇదే. దాంతో చాలామంది శృతిహాసన్ కు ఈ రెండు చిత్రాలు మంచి బ్రేక్నిస్తాయని భావిస్తే మరల కథ మొదటికి వచ్చిందని కామెంట్ చేస్తున్నారు.
ఈ రెండు చిత్రాల వలన శృతి కెరీర్‌కి మంచి అంటూ ఏమీ జరగలేదు. పైపెచ్చు ఓ గ్లామర్ డాల్ గా అటు ఇటు కాకుండా మధ్యలో ఆటలో అరటిపండుగా మిగిలిపోయింది. పేరుకి హీరోయినే గాని ఈమెకి సరైన పాత్ర అంటూ రెండు చిత్రాలలో లేదు. వీరసింహారెడ్డిలో శృతిహాసన్ పాత్ర కంటే హనీ రోజ్ పాత్రే మెప్పించింది. ఇక వాల్తేరు వీరయ్యలో రా ఏజెంట్ గా కనిపించినా అది కూడా నామ మాత్రమే. ఏదో నామ్కే వాస్తే అన్నట్లుగా ఆమె పాత్ర సాగుతుంది. దాంతో ప్రస్తుతం శృతీ కళ్లన్నీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం సలార్ పైనే ఉన్నాయని చెప్పవచ్చు. కనీసం ఆ చిత్రంలో అయినా శృతికి సరైన క్యారెక్టర్ పడుతుందో లేదో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



