చరణ్ కి మరోసారి ప్లస్సయ్యేనా!
on Dec 28, 2021

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ వెండితెరపై సందడి చేసి దాదాపు రెండేళ్ళవుతోంది. 2019 సంక్రాంతికి రిలీజైన `వినయ విధేయ రామ` తరువాత మళ్ళీ చరణ్ సిల్వర్ స్క్రీన్ పై ఎంటర్టైన్ చేసిందే లేదు. ఈ నేపథ్యంలో.. 2022 ఆరంభంలో వరుస నెలల్లో రెండు ఆసక్తికరమైన చిత్రాలతో వినోదాలు పంచనున్నాడు రామ్ చరణ్. ఆ చిత్రాలే.. `ఆర్ ఆర్ ఆర్`, `ఆచార్య`. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో చరణ్ జట్టుకట్టిన `ఆర్ ఆర్ ఆర్` జనవరి 7న విడుదల కానుండగా.. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన `ఆచార్య` ఫిబ్రవరి 4న రిలీజ్ కానుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఈ రెండు సినిమాలు కూడా పిరియడ్ టచ్ తో సాగే సినిమాలే. `ఆర్ ఆర్ ఆర్` 1920ల కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో ఫిక్షన్ గా తెరకెక్కితే.. `ఆచార్య` 30 ఏళ్ళ క్రితం నాటి కథాంశంతో రూపొందిందని సమాచారం. కాగా, గతంలో చరణ్ చేసిన పిరియడ్ డ్రామాలు `మగధీర`, `రంగస్థలం` ఘనవిజయం సాధించిన నేపథ్యంలో.. `ఆర్ ఆర్ ఆర్`, `ఆచార్య` కూడా అదే బాటలో పయనించి తన కెరీర్ కి మరోసారి ప్లస్సవుతాయేమో చూడాలి.
`ఆర్ ఆర్ ఆర్`కి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించగా.. `ఆచార్య`ని విజనరీ కెప్టెన్ కొరటాల శివ రూపొందించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



