'కస్టడీ' ప్లాపయినా కృతి శెట్టికి భారీ ఆఫర్!
on May 23, 2023

'ఉప్పెన'తో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన కృతి శెట్టి మొదటి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె త్వరలోనే స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందని భావించారంతా. అయితే వరుసగా ఆమెను నాలుగు పరాజయాలు పలకరించాయి. దీంతో తెలుగులో ఆమె స్పీడ్ కి బ్రేక్ లు పడ్డాయి. ఇలాంటి సమయంలో ఊహించనివిధంగా ఆమెకి తమిళ్ నుంచి భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఏకంగా కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుందని సమాచారం.
విజయ్ తన 68వ చిత్రాన్ని వెంకట్ ప్రభు దర్శకత్వంలో రీసెంట్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో హీరోయిన్ గా కృతి శెట్టిని ఎంపిక చేసినట్లు న్యూస్ వినిపిస్తోంది. వెంకట్ ప్రభు ఇటీవల నాగచైతన్య హీరోగా 'కస్టడీ' అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా కృతి శెట్టినే నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా మిగిలింది. అయినప్పటికీ కృతి శెట్టి నటనను మెచ్చిన వెంకట్ ప్రభు ఆమెకు మరో అవకాశం ఇవ్వడానికి సిద్ధమైనట్లు వినికిడి. అదే నిజమైతే కృతి, బిగ్ స్టార్ సరసన నటించే మొదటి సినిమా ఇదే అవుతుంది. మొత్తానికి 'కస్టడీ' ఫ్లాప్ అయినప్పటికీ.. దాని మూలంగా కృతికి భారీ ఆఫర్ రావడం ఆసక్తికరంగా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



