స్పీల్ బర్గ్ కి ఛాలెంజ్ విసిరిన కృష్ణం రాజు
on Mar 27, 2017

బాహుబలి 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి రెబెల్ స్టార్ కృష్ణం రాజు ఒక ముఖ్య అతిధి గా విచ్చేసారు. సాధారణంగా ఇలాంటి ఫంక్షన్ లకి దూరంగా ఉండే కృష్ణం రాజు గారు, ఈసారి మాత్రం సమయం కేటాయించారు. అంతేనా, రాజమౌళి ని పొగడ్తలతో ముంచెత్తి ప్రేక్షకులని ఆనందపరిచే మంచి విషయాలు చెప్పాడు. ఏకంగా, హాలీవుడ్ డైరెక్టర్ స్పీల్ బర్గ్ కే ఛాలెంజ్ విసిరి అందరిని విస్మయానికి గురి చేసారు. ఇంతకు ముందు జరిగిన ఒక సంఘటన గుర్తుచేసుకుంటూ, స్పీల్ బర్గ్ ని ఇండియన్ సినిమా మీద తన అభిప్రాయం అడిగితే 'అసలు వీళ్ళు ఒకే కథ పైన కొన్ని వేల సినిమాలు ఎలా తీస్తారో నాకైతో అర్ధం కాదు' అన్నారంట.
"ఇప్పుడు నేను స్పీల్ బర్గ్ కి చెప్తున్నాను, మీరు బాహుబలి చుడండి తర్వాత మీ అభిప్రాయాన్ని చెప్పండి" అని అన్నారు కృష్ణం రాజు గారు. రాజమౌళి స్పీల్ బర్గ్ ని మించిన దర్శకుడు అవ్వాలని కోరుకుంటానని చెప్పుకొచ్చారు. ప్రభాస్, రాజమౌళి ఫాన్స్ కృష్ణం రాజు వ్యాఖ్యలకి ఈలలతో తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



