కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం!
on Aug 18, 2025

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు 83 ఏళ్ళ వయసులో జూలై 13న కన్నుమూసిన సంగతి తెలిసిందే. కోట శ్రీనివాసరావు మరణించి నెల రోజులే అవుతుంది. తాజాగా ఆయన ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. కోట శ్రీనివాసరావు సతీమణి కోట రుక్మిణి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ లోని తన నివాసంలో ఈ రోజు(ఆగస్టు 18) తుది శ్వాస విడిచారు. కోట రుక్మిణి వయసు 75 సంవత్సరాలు.
గతంలో ఓ ఇంటర్వ్యూలో తన సతీమణి రుక్మిణి ఆరోగ్యం గురించి కోట ఓపెన్ అయ్యారు. "నాకు 1968లో రుక్మిణితో పెళ్లయింది. 1973లో నా భార్య డెలివరీ సమయంలో ఒక విషాదం జరిగింది. రుక్మిణి తల్లి చనిపోయారు. దాంతో నా భార్య కృంగిపోయి.. సైకియాట్రిక్ పేషెంట్ గా మారిపోయింది. 30 ఏళ్ళ పాటు నన్ను కూడా గుర్తుపట్టలేదు." అని కోట చెప్పారు.
కోట శ్రీనివాసరావు, రుక్మిణి దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. కుమారుడు ఆంజనేయ ప్రసాద్ 2010లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



