సల్మాన్ ఖాన్ ని కలిసిన కోన వెంకట్
on Jun 22, 2011
సల్మాన్ ఖాన్ ని కలిసిన కోన వెంకట్ అని ఫిలిం నగర్ లో అనుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే సిసియల్ అదేనండి సెలెబ్రిటీస్ క్రికెట్ లీగ్ మన రాష్ట్రంలో జరిగిన సందర్భంగా కోన వెంకట్ ను ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కలిశారు. అప్పుడే సల్మాన్ ఖాన్ తాను త్వరలోనటించబోయే "షేర్ ఖాన్" సినిమాకి చక్కని కథనందించాల్సిందిగా ప్రముఖ రచయిత కోన వెంకట్ ను కోరారట. ఆ "షేర్ ఖాన్" సినిమాకి సంబంధించి కథను హీరో సల్మాన్ ఖాన్ కు చెప్పటానికి కోన వెంకట్ ముంబాయికి వెళ్ళారట.
.jpg)
కోన వెంకట్ చెప్పిన కథ నచ్చటంతో ఆ కథకు స్క్రీన్ ప్లే వ్రాసే బాధ్యతను కూడా కోన వెంకట్ కే సల్మాన్ ఖాన్ అప్పగించినట్లు తేలిసింది. ఈ "షేర్ ఖాన్ " సినిమాకి సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహైల్ ఖాన్ దర్శకత్వం వహించనున్నాడు. మరో ఒకటి రెండు సిటింగ్స్ లో ఈ "షేర్ ఖాన్" సినిమా కథ ఫైనలైజ్ అవుతుందని అనుకుంటున్నారు. ఇటీవల సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన "రెడీ" సినిమాకి గోపీ మోహన్ కథను అందించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



