ఏపీలో 'కింగ్‌డమ్' టికెట్ రేట్స్ పెంపు.. ఎంతో తెలుసా..?
on Jul 24, 2025

తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరలు తక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో దాదాపు అన్ని సినిమాలకు వాటి బడ్జెట్ ని బట్టి.. టికెట్ ధరల పెంపుకి అనుమతి ఇస్తోంది ప్రస్తుత ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలోనే 'కింగ్‌డమ్' సినిమాకి పది రోజుల పాటు టికెట్ రేట్స్ పెంపుకు అనుమతి లభించింది. (Kingdom)
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన చిత్రం 'కింగ్‌డమ్'. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. జూలై 26న ట్రైలర్ విడుదల కానుండగా.. ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి స్పందన లభించింది. ప్రస్తుతం విజయ్ ఫ్లాప్స్ లో ఉన్నాడు. దీంతో 'కింగ్‌డమ్'తో కమ్ బ్యాక్ ఇస్తాడని అభిమానులు ఆశపడుతున్నారు.
ఇక ఇప్పుడు 'కింగ్‌డమ్'కి ఏపీ ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. మొదటి పది రోజుల పాటు టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్స్ లో రూ.50, మల్టీప్లెక్స్ లలో రూ.75 పెంచుకోవడానికి పర్మిషన్ లభించింది. ఈ టికెట్ రేట్స్ పెంపుతో ఏపీలో 'కింగ్‌డమ్' మంచి ఓపెనింగ్స్ రాబడుతుందేమో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



