కిక్ 2 మూవీ రివ్యూ
on Aug 21, 2015
కథ:
.jpg)
కిక్ సినిమాకు కొనసాగింపుగా ఈ కిక్-2 ప్రారంభమవుతుంది. కళ్యాణ్ అలియాస్ కిక్(రవితేజ) పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడతారు. అతని కొడుకే (మిస్టర్ కంఫర్ట్) రాబిన్ హుడ్. మెడిసిన్ చేసి డాక్టర్ అవుతాడు. సొంతంగా హాస్పటల్ కట్టాలన్న కోరికతో ఇండియాలో తనకున్న ఆస్తులను అమ్మలనుకుంటాడు. ఆ సమయంలో తన తండ్రి ఆస్తిని ఎవరో రౌడీ కబ్జా చేశాడని తెలుసుకుని దాన్ని దక్కించుకోవడానికి హైదరాబాద్ కు వస్తాడు. అలా వచ్చిన రాబిన్ హుడ్‌కి ఛైత్రతో పరిచయం ఏర్పడుతుంది. యధావిదిగా ఛైత్ర రాబిన్‌తో ప్రేమలో పడుతుంది కానీ మనోడు తనని ప్రేమించడు.మరోవైపు తన ఆస్తికోసం రౌడీల ఆటకట్టించిన రాబిన్ హుడ్ నీ చూసి..ఓ నార్త్ వ్యక్తి ఠాకూర్ (రవికిషన్) అనే దాదా ధాటికి విలవిలలాడుతున్న తన గ్రామానికి రాబిన్ అవసరం ఉందని భావిస్తాడు. తన గ్రామానికి వెళ్లి అక్కడి జనాలకు రాబిన్ గురించి వివరిస్తాడు. ఆ గ్రామస్థులంతా కలిసి రాబిన్ ను తమ గ్రామానికి రప్పిస్తారు. మరి ఠాకూర్ మీదకు రాబిన్ ను ఆ గ్రామస్థులు ఎలా ఉసిగొల్పారు? రాబిన్ ఠాకూర్ కు ఎలా బుద్ధి చెప్పాడు? అన్నది మిగతా కథ.
రవితేజ,రకుల్, విలన్ ల నటన:

ఇందులో చెప్పుకోవాల్సిందే రవితేజ నటన, సినిమా కథకు తగిన విధంగా తండ్రి, కొడుకు పాత్రలో ఒదిగిపోవడమే కాకుండా కంఫర్ట్ కోసం ఆలోచించే పాత్రలో ఒదిగిపోయాడు. సినిమా మొత్తాన్ని లీడ్ చేశాడు. ఈ గమనంలో తన ఎనర్జీ లెవల్స్ ఎక్కడా డ్రాప్ కాలేదు. తనదైన మార్కు నటననతో ఆకట్టుకున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ గానే కనపడుతూ మంచి పెర్ ఫార్మెన్స్ పరంగా బాగా నటించింది. పాటల్లో మంచి లుక్స్ తో కనిపించింది. రవికిషన్ విలనీజం బాగుంది. మిడిల్ ఏజ్ డ్ విలన్ గా మంచి నటనను కనపరిచాడు.
తమన్ పాటలు, .సినిమాటోగ్రాపి:
.jpg)
ఎస్ఎస్ తమన్ పాటలు కొన్నిబాగున్నాయి.బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సోసోగా సాగుతుంది. ‘కిక్ 2′ సినిమాలో మనకు బాగా కొత్తగా అనిపించేది కథ కోసం ఎంచుకున్న బిహార్ లోని విలాస్ పూర్ బ్యాక్ డ్రాప్. ఈ బిహార్ బ్యాక్ డ్రాప్ ని, అక్కడి కల్చర్ ని, అక్కడి లొకేషన్స్ ని సినిమాకి సరిపోయేలా పర్ఫెక్ట్ గా వాడుకున్నారు. ఈ విషయంలో మార్కులు కొట్టేసింది సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస. ఆయన ప్రతి లొకేషన్ ని ఇంకా చూడాలి అనేంతలా చూపించాడు. ఇక నటీనటుల్ని ప్రజంట్ చేసిన విధానం సూపర్బ్.
కళ్యాణ్ రామ్ ప్రొడక్షన్:
కళ్యాణ్ రామ్ ఖర్చుకు ఏమాత్రం వెనుకాడలేదు కానీ.. చాలా చోట్ల ఖర్చు వృథా అయింది. భారీగా సెట్లు వేశారు కానీ.. చాలావరకు అనవసరమే.ఎడిటింగ్ లో చాలా పెద్ద తప్పిదాలు జరిగాయి. ముఖ్యంగా సెకండాఫ్ లో గంట కథనాన్ని పావుగంటకు తగ్గించి ఉంటే సినిమా మరో రకమైన అనుభూతిని మిగిల్చేది.
వక్కంతం వంశీ..సురేందర్ రెడ్డి:

వక్కంతం వంశీ కథ విషయానికి వస్తే.. వంశీ ఎప్పుడు కొన్ని ఆసక్తికర పాత్రలని క్రియేట్ చేసి ఆ తర్వాత వాటిని అల్లుకుంటూ ఓ కథని సిద్దం చేస్తాడు. కిక్ 2కి అలానే జరిగింది. కానీ కిక్ లో ఉన్నంతగా పూర్తి కొత్తదనం ఈ కథలో లేదు. కొన్నిచోట్ల రెగ్యులర్ కమర్షియల్ కథ అనే ఫీలింగ్ కలిగేలా చేసాడు. వక్కంతం వంశీ డైలాగ్స్ కూడా ఓ సూపర్ అనేలా కాకుండా జస్ట్ ఓకే అనేలా ఉన్నాయి. ఇక కథనం – దర్శకత్వం డీల్ చేసిన సురేందర్ రెడ్డి ఈ సినిమా విషయంలో కొంచెం ఫెయిల్ అయ్యిడనే చెప్పాలి.
పంచ్ లైన్: కిక్ ని ఊహించుకొని వెళ్ళిన వారికి 'కిక్ 2' అంత కంఫర్ట్ గా లేకపోవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



