కియారా అద్వాని... ఓ గుడ్‌న్యూస్!
on Nov 30, 2018

మహేశ్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన 'భరత్ అనే నేను'తో తెలుగు చిత్ర పరిశ్రమకు కియారా అద్వాని కథానాయికగా పరిచయమయ్యారు. రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న 'వినయ విధేయ రామ'లో నటిస్తున్నారు ఓ పక్క తెలుగు సినిమాల్లో నటిస్తూ, మరో పక్క హిందీ సినిమాలపైనా ఆమె దృష్టి పెడుతున్నారు. 'అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ 'కబీర్ సింగ్'లో కియారానే కథానాయిక. దీంతో పాటు రాజ్ మెహతా దర్శకత్వంలో ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్న 'గుడ్ న్యూస్'లో దిల్జిత్ దోసాంజ్ సరసన ఆమె కథానాయికగా ఎంపిక అయ్యారు. అక్షయ్‌కుమార్, కరీనాకపూర్ మరో జంటగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శుక్రవారం మొదలైంది. అయితే.. అక్షయ్, కరీనా షూటింగులో పాల్గొనలేదు. త్వరలో పాల్గొంటారట. దిల్జిత్, కియారా షూటింగ్ స్టార్ట్ చేశారు. రామ్ చరణ్ సరసన ఆమె నటిస్తున్న 'వినయ విధేయ రామ' సంక్రాంతికి విడుదల కానున్న సంగతి తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



