కీరవాణి కుమారుడు హీరోగా ఎంట్రీ!!
on Mar 20, 2019

టాలీవుడ్ లో సెలబ్రిటీల వారసులు ఎంట్రీ ఇవ్వడం అనేది సర్వ సాధారణం. ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోల వారసులు హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన వారున్నారు. ఇప్పుడిక మరో వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతడు ఎవరో కాదు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు సింహా. ఇప్పటికే కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవ ప్లే బ్యాక్ సింగర్ గా రాణిస్తూనే సంగీత దర్శకుడుగా కూడా ఓ సినిమాతో పరిచయం కాబోతున్నాడు. సింహా సుకుమార్ దగ్గర డైరక్షన్ టీమ్ లో `రంగస్థలం` చిత్రానికి పని చేసాడు. ఇక ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.
అయితే రంగస్థలం తీసిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలోనే నిషాంత్ అనే కొత్త డైరక్టర్ దర్శకత్వంలో సింహాను హీరోగా పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ చిత్రానికి కాల భైరవ మ్యూజిక్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఎలక్షన్స్ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



