పుకార్లని నమ్మద్దు.. నన్ను నమ్మి వేచి ఉండండి
on May 23, 2025

ప్రముఖ హీరో రిషబ్ శెట్టి(Rishab Shetty)స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'కాంతార'(Kantara)మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరకి తెలిసిందే. దీంతో 'కాంతార' కి ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న 'కాంతార చాప్టర్ 1'(Kantara chapter 1)పై పాన్ ఇండియా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలతో ఆ అంచనాలు పెరిగాయని కూడా చెప్పుకోవచ్చు. అక్టోబర్ 2 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
కానీ కొన్ని రోజుల నుంచి అక్టోబర్ 2 నుంచి 'కాంతార చాప్టర్ 1 ' వాయిదా పడనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు వాటిపై చిత్ర బృందం ఎక్స్ వేదికగా స్పందిస్తు' అనుకున్న ప్రకారమే షెడ్యూల్స్ వేసుకొని షూటింగ్ ని పూర్తి చేస్తున్నాం. అక్టోబర్ 2 న ఖచ్చితంగా రిలీజ్ ఉంటుంది. మమ్మల్ని నమ్మండి. వేచి ఉండటం ఎంత పెద్ద విలువైందో మీకే అర్ధమవుతుంది. ఊహాగానాలకు దూరంగా ఉంటు, అనధికార ప్రకటనలని షేర్ చేయవద్దని మా విజ్ఞప్తి అని చాప్టర్ 1 టీం ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.
కాంతారా చాప్టర్ 1 కథ విషయానికి వస్తే కాంతార మూవీ ఎక్కడ అయితే ప్రారంభమయ్యిందో దానికి ముందు జరిగిన సంఘటనల్ని ఫ్రీక్వెల్ లో చూపించనున్నారు. దాదాపుగా 120 కోట్ల బడ్జెట్ తో కె జి ఎఫ్, కాంతార ఫేమ్ విజయ్ కిరంగదుర్ నిర్మిస్తున్నాడు. మొదటి భాగంలో ఉన్న నటులతో పాటు మరికొంత మంది ఫ్రీక్వెల్ లో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. అన్ని భాషల్లోను ఒకేసారి విడుదల చేసే యోచనలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



