మోదీని కలిసిన యష్... ఏం మాట్లాడుకున్నారో తెలుసా?
on Feb 14, 2023
.webp)
కన్నడ సినీ ప్రముఖులను ఆహ్వానించి విందు ఇచ్చారు ప్రధాన మంత్రి మోదీ. యష్, రిషబ్ శెట్టి, పునీత్ రాజ్‌కుమార్ భార్య, నిర్మాత విజయ్ కిరగందూర్ ఈ విందులో పాల్గొన్నారు.పీఎంని కలిసినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు టాప్ హీరో యష్. ఆయన మాట్లాడుతూ ``నాకు చాలా సంతోషంగా ఉంది. మోదీ ఇండస్ట్రీ పరంగా తమ విజన్‌ని షేర్ చేసుకున్నారు. మేం చెప్పిన విషయాలను చాలా జాగ్రత్తగా విన్నారు. ప్రభుత్వం నుంచి మేం ఏం కోరుకుంటున్నామో అడిగి తెలుసుకున్నారు. మా అభిప్రాయాలను స్పష్టంగా పంచుకున్నాం. కేవలం కన్నడకు సంబంధించే కాదు, ఇండియన్ ఇండస్ట్రీకి కూడా ఏవైతే బావుంటాయో, వాటినే ఆయనతో చెప్పాం. ప్రభుత్వం తరఫున చేయాల్సిన అన్నిటినీ చేస్తామని ఆయన అన్నారు. సినిమాల పట్ల మోదీకున్న నాలెడ్జిని చూసి మేం విస్తుపోయాం. ఆయన విజన్ చాలా పెద్దది. ఆయనతో మాట్లాడుతున్నంత సేపు ఇన్‌స్పయిరింగ్‌గా అనిపించింది`` అని అన్నారు.
రిషబ్ శెట్టి మాట్లాడుతూ ``నా చిరకాల కల నెరవేరింది. కన్నడ సినిమా ఇండస్ట్రీ గురించి, ఇండియన్ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడారు. కాంతార సక్సెస్ గురించి అభినందించడం మర్చిపోలేను. మన సంస్కృతి, సంప్రదాయాలను, మన మూలాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆయన నాలెడ్జ్ చూసి విస్తుపోయాను`` అని తెలిపారు.హోంబలే ఫిల్మ్స్ విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ ``మోదీని కలవడం ఆనందంగా అనిపించింది. 10-12 నిమిషాల సమయాన్ని మాకోసం కేటాయించారు. మేం కూడా కొన్ని విషయాలను పంచుకున్నాం. చాలా పాజిటివ్‌గా స్పందించారు`` అని అన్నారు.
పునీత్ రాజ్‌కుమార్ భార్య కూడా మోదీని కలిశారు. అప్పు పేరు మీద బెంగుళూరులో రోడ్డుకు పేరు పెట్టినందుకు ఆనందంగా ఉందని అన్నారు.కన్నడ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నందుకు ఆనందంగా ఉందని, కన్నడ సినిమాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్న తీరు ప్రశంసనీయమని అన్నారు మోదీ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



