ఓయో రూమ్ లో పట్టుబడ్డ ప్రముఖ కొరియోగ్రాఫర్..డ్రగ్స్ పార్టీ కూడా
on Dec 2, 2024

ఈటీవీలో ప్రసారమయ్యే 'ఢీ' ప్రోగ్రాం ద్వారా ప్రేక్షకులకి పరిచయమైన డాన్సర్ కన్హ మహంతి.(kanha mohanty)పదహారేళ్ల వయసులోనే 'ఢీ' లోకి ఎంట్రీ ఇచ్చిన మహంతి మెరుపులాంటి తన డాన్స్ తో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఆ తర్వాత 'ఢీ' 10 లో కంటెస్ట్ కి పెర్ఫార్మర్ గా కూడా చేసిన మహంతి 'ఢీ' జోడి లో కూడా అదిరిపోయే పెర్ఫార్మ్ చేసి కొరియోగ్రాఫర్ స్థాయికి ఎదిగాడు.
రీసెంట్ గా హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్న ఒక ఓయో రూమ్‌లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ మహంతి పోలీసులకి పట్టుబడ్డాడు.ఆ సమయంలో అక్కడ ఉన్న ఎండీఎంఏ డ్రగ్స్‌తో పాటు మరో రెండు రకాల డ్రగ్స్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ప్రముఖ ఆర్కిటెక్చర్ ప్రియాంక రెడ్డి ఇచ్చిన ఆ పార్టీలో మహంతి తో పాటు ఇంకో నలుగురిని కూడా అరెస్టు చెయ్యడం జరిగింది.
మహంతి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండంతో పాటు సొంతంగా సాంగ్స్ చేస్తూ తన యూ ట్యూబ్ చానల్స్ లో అప్ లోడ్ చేస్తుంటాడు. పెద్ద సంఖ్యలో మహంతి కి ఫాలోవర్స్ కూడా ఉన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



