సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ ఎడిటర్ అనుమానాస్పద మృతి!
on Oct 30, 2024

సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. త్వరలో విడుదల కానున్న పాన్ ఇండియా మూవీ 'కంగువా'కు పని చేసిన ప్రముఖ ఎడిటర్ నిషాద్ యూసుఫ్ (43) కన్నుమూశారు. కొచ్చిలోని పనమ్పిల్లీ నగర్ లో ఉన్న తన అపార్ట్మెంట్ లో విగతజీవిగా కనిపించారు. అర్ధ రాత్రి 2 గంటల సమయంలో ఆయన మరణించినట్లు తెలుస్తోంది. మృతికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిషాద్ ఆత్మహత్య చేసుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి నిజంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నారా? ఆత్మహత్యకు గల కారణాలేంటి? వంటి విషయాలు తెలియాల్సి ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



