నన్ను జైల్లో పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది! - కంగనా రనౌత్
on Oct 23, 2020

బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలిపై అంధేరి మేజిస్ట్రేట్‌లో క్రిమినల్ కేసు నమోదు అయింది. మతపరమైన అంశాల్లో సమాజంలో అసమ్మతిని సృష్టించినందుకు అక్కాచెల్లెళ్లు ఇద్దరిపై కేసు పెట్టారు. ఇటీవల ముంబైలోని బంద్రా పోలీసులు 'ముంబైను పాక్ అఆక్రమిత కాశ్మీరుతో పోల్చిన' కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా కంగనాకి, ఆమె సోదరికి సమన్లు జారీ చేశారు. ఇది మరో కేసు అన్నమాట. దీనిపై కంగనా రనౌత్ స్పందించారు. మహారాష్ట్ర ప్రభుత్వం తనను జైల్లో పెట్టాలని ప్రయత్నిస్తున్నట్టు ట్వీట్ చేశారు.
"నేను ఝాన్సీ రాణి, సావర్కర్, నేతా బోస్ వంటి వారిని ఆరాధిస్తాను. ఈ రోజు ప్రభుత్వం నన్ను జైలులో పెట్టడానికి ప్రయత్నిస్తుంది. నేను ఎంపిక చేసుకున్న మార్గాలపై అది నాకు నమ్మకం కలిగిస్తుంది. జైలులో ఉండటానికి వెయిట్ చేస్తున్నా. త్వరలోనే నా విగ్రహాలు పెడతారేమో. అది నా జీవితానికి అర్ధం ఇస్తుంది. జై హింద్" కంగనా రనౌత్ ట్వీట్ చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఫాసిస్ట్ ప్రభుత్వంతో కంగనా పోల్చారు. దాంతో పోరాడుతున్నాని ఆమె అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



