కమల్ హాసన్ తల నరికేస్తానంటున్న ప్రముఖ నటుడు.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
on Aug 11, 2025

యూనివర్సల్ స్టార్ 'కమల్ హాసన్'(Kamal Haasan)ఇటీవల ప్రముఖ హీరో 'సూర్య'(Suriya)స్థాపించిన 'అగరం' ఫౌండేషన్(Agaram Foundation)లో జరిగిన వార్షికోత్సవ వేడుకలకి ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులని ఉద్దేశించి కమల్ మాట్లాడుతు 'నియంతృత్వం, సనాతన బానిసత్వాన్ని అంతం చేయగల శక్తి ఒక్క విద్యకు మాత్రమే ఉంది. ఈ యుద్ధంలో గెలవాలంటే వేరే ఏ ఆయుధాన్ని మీ చేతిలోకి తీసుకోకండి. ఆ విధంగా మీరు గెలవలేరు. మెజారిటీ మూర్ఖులు మిమ్మల్ని ఓడిస్తారు. జ్ఞానం ఓడిపోతుందని మాట్లాడటం జరిగింది.
కమల్ మాట్లాడిన ఈ మాటలపై రీసెంట్ గా ప్రముఖ తమిళ టివి నటుడు 'రవిచంద్రన్'(Ravi Chandran)మాట్లాడుతు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన కమల్ హాసన్ ని చంపేస్తానని, తల నరికేస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు ఈ మాటలు తమిళనాట సంచలనంగా మారాయి. ఇక కమల్ అభిమానులతో పాటు, మక్కల్ నీది మయ్యం' పార్టీ కార్యకర్తలు తమిళనాడు వ్యాప్తంగా ఉన్న పలు పోలీస్ స్టేషన్ లలో రవిచంద్రన్ పై ఫిర్యాదు చేసారు. రవిచంద్రన్ పై చర్యలు తీసుకొని ఇక ముందు ఎవరు ఇటువంటి వ్యాఖ్యలు చెయ్యకుండా చూడాలని కోరుతున్నారు.
రవిచంద్రన్ సుదీర్ఘ కాలం నుంచి పలు రకాల సీరియల్స్ లో చేస్తు మంచి గుర్తింపు పొందాడు. ముఖ్యంగా ' పాండియన్ స్టోర్స్'(Pandian Stores)సీరియల్ రవిచంద్రన్ కి ప్రత్యేక గుర్తింపుని ఇచ్చింది. సెంథిల్ అనే క్యారక్టర్ ద్వారా ప్రతి ఇంటికి ఎంతగానో చేరువయ్యాడు. 'మక్కల్ నీది మయ్యం' పార్టీ అధ్యక్షుడి హోదాలో కమల్ హాసన్ ఇటీవల అధికార డిఎంకె పార్టీ మద్దతుతో రాజ్యసభకు ఎంపిక అయ్యాడు. ఆ హోదాలోనే అగరం ఫౌండేషన్ కి హాజరై, సనాతన దర్మంపై కీలక వ్యాఖ్యలు చేసాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



