ఆరోజు కమల్ ఆఫీసులో ఏం జరిగింది?
on Aug 17, 2016
ఇటీవల కమల్‌హాసన్ కాలిగాయంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. దాదాపుగా రెండు వారాలు ఆసుపత్రిలోనేచికిత్స చేయించుకొని.. ఇంటికి చేరుకొన్నాడు. అయితే మరో రెండు నెలల విశ్రాంతి అవసరమని డాక్టర్లు తేల్చారు. ప్రస్తుతం శభాష్ నాయుడు సినిమాలో నటిస్తున్నాడు కమల్. గాయం నుంచి పూర్తిగా కోలుకొన్నాకే మళ్లీ షూటింగ్‌కి వెళ్తానని కమల్ చెబుతున్నాడు. అయితే కమల్‌కి గాయం ఎలా అయ్యింది? అసలు ఆరోజు ఏం జరిగింది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తాజాగా బయట పడ్డాయి.
చెన్నైలోని ఆళ్వార్ పేటలో కమల్‌హాసన్ ఆఫీసు ఉంది. తన గది బాల్కనీ నుంచి... రోడ్డుపైన వచ్చీ పోయే జనాలను చూడడం అంటే కమల్‌కి చాలా ఇష్టం. ప్రతీరోజూ.. కమల్ కాలక్షేపం అదే. ఆరోజు కూడా బాల్కనీలో నిలబడి రోడ్డుపై వాహనాలను చూస్తూ నిలబడ్డాడటకమల్. అయితే ఒక్కసారిగా ఆ బాల్కనీ కూలిపోయింది. దాంతో 18 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డాడు కమల్. సమయానికి కమల్ సిబ్బంది అక్కడే ఉన్నారట. వాళ్లెవరూ చూడకపోతే.. ప్రాణాలతో బతికి బట్టకట్టేవాడ్ని కాదని కమల్ చెబుతున్నాడు. ప్రస్తుతం కమల్ లేచి నడవలేకపోతున్నాడట. అడుగు తీసి అడుగు వేయడానికి కూడా మరొకరి సహాయం తీసుకోవాల్సివస్తోందట. అదృష్టం కొద్దీ కమల్ గాయాలతో బయటపడ్డాడు. లేదంటే... ఏమైపోదునో..?