జర్నలిస్టులకు కమల్ హాసన్ సాయం
on May 9, 2020

కమల్ హాసన్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. తన మాటలు, పాటల ద్వారా ప్రజల్లో కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్న ఆయన, ఈ మహమ్మారి వల్ల ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడానికి ముందుకొచ్చారు. నావెల్ కరోనా, కోవిడ్-19 సోకడంతో చికిత్స తీసుకుంటున్న జర్నలిస్టులకు ఆయన సాయం అందించారు. ఒక్కొక్కరికీ 15 వేల రూపాయల చొప్పున 40 మంది జర్నలిస్టులకు 6 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. కమల్ సహాయం పట్ల తమిళనాడు రాష్ట్రంలో జర్నలిస్టు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
యువ హీరో, కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్ సైతం జర్నలిస్టులకు సాయం చేశారు. లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన 60మంది జర్నలిస్టులకు ఆయన సహాయం చేశారు. ఒక్కొక్కరికీ మూడు వేల రూపాయల చొప్పున ఒక లక్షా ఎనభై వేల రూపాయలు అందించారు. వచ్చే నెలలోనూ ఇదే విధంగా ఆయన సహాయం చేయాలని అనుకుంటున్నారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



