సినీగీత రచయిత కలువకృష్ణ సాయి దుర్మరణం
on Jun 24, 2011
సినీగీత రచయిత కలువకృష్ణ సాయి దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే వర్థమాన సినీ గీత రచయిత కలువకృష్ణ సాయి నిన్నరాత్రి గుండెపోటుతో అకాలమరణం పాలయ్యారు. చనిపోయే నాటికి ఆయన వయసు ముప్పై సంవత్సరాలు మాత్రమే. కలువ కృష్ణ సాయి "కబడ్డీ కబడ్డీ, సామాన్యుడు, బహుమతి, విక్టరీ, రంగ ది దొంగ, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పల్రాజు, గాయం-2, రక్తచరిత్ర" వంటి సినిమాలకు పాటలనందించారు.
.jpg)
ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మ నిర్మించిన "రక్తచరిత్ర"లో రాసిన పాటకు కలువకృష్ణ సాయికి పాటల రచయితగా మంచి పేరు గుర్తింపు లభించాయి. ఆ తర్వాత "కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పల్రాజు" పాటలకు కూడా కలువ కృష్ణ సాయికి మంచి పేరు లభించింది. ఇప్పుడిప్పుడే పాటల రచయితగా పేరు సంపాదించుకుంటున్న కలువకృష్ణ సాయి చిన్న వయసులోనే చనిపోవటం దురదృష్టకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని తెలుగువన్ ఆ భగవంతుని కోరుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



