కల్కికి దీనికి ఏ సంబంధం లేదు
on Apr 25, 2025
శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'కలియుగమ్ 2064'. ప్రమోద్ సుందర్ దర్శకుడు. ఆర్కే ఇంటర్నేషనల్, ప్రైమ్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. (Kaliyugam 2064 Trailer)
140 సెకన్ల నిడివితో రూపొందిన 'కలియుగమ్' ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. 2064 లో మనుషులు ఎలా ఉంటారు? ఆహారం, నీరు కోసం ఎలాంటి ఇబ్బందులు పడతారు? వంటి విషయాలను చూపిస్తూ ట్రైలర్ సాగింది. కొందరు మనుషులు ఆహరం కోసం తిప్పలు పడుతుంటే, మరికొందరు మాత్రం ఆయుధాలు పట్టి వారిపై పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు ప్రభాస్, నాగ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన 'కల్కి 2898 AD' మూవీ గుర్తురాక మానదు. సెటప్, సీన్స్ కల్కి చిత్రాన్ని పోలి ఉన్నాయి. అయితే మన మెదడులో 'కల్కి' అనే ఆలోచన రాగానే.. దానికి సమాధానం అన్నట్టుగా "కల్కికి దీనికి ఏ సంబంధం లేదు" అనే డైలాగ్ ట్రైలర్ లో వినిపించడం విశేషం. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. మరి సినిమా ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
