పవన్ కాజల్‌ని పట్టాడా?
on Jul 28, 2015
.jpg)
పవన్ కల్యాణ్ సినిమాకోసం కథానాయికల వేట కొనసాగుతోంది. బాలీవుడ్, టాలీవుడ్ మొత్తం జల్లెడ వేసి పవన్‌కి తగ్గ జోడీ కోసం అన్వేషిస్తోంది చిత్రబృందం. పవన్ కల్యాణ్ - బాబి కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సర్దార్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈనెల 29 నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. పవన్ ఈ షెడ్యూల్‌తోనే కెమెరా ముందుకు రాబోతున్నాడు. అయితే ఇప్పటి వరకూ కథానాయిక ఎవరనే విషయంపై చిత్రబృందం స్పష్టతకు రాలేకపోతోంది. చిత్రబృందం ముంబై వెళ్లి.. కథానాయిక కోసం గాలిస్తున్నారు. అయితే ఈలోగా పవన్... కాజల్‌ని ఎంచుకోవాలని చిత్రబృందానికి సూచించినట్టు తెలుస్తోంది.
అగ్ర కథానాయకులందరితోనూ నటించిన కాజల్‌కి ఇప్పటి వరకూ పవన్‌తో జోడీ కట్టే ఛాన్స్ రాలేదు. కాజల్ అయితే తమ కెమిస్ట్రీ కొత్తగా ఉంటుందని పవన్ భావిస్తున్నాడట. కొత్తమ్మాయిని తీసుకోవడం కంటే.. సీనియర్ కథానాయికని ఎంచుకొంటే బాగుంటుందని పవన్ భావిస్తున్నాడట. పవన్ ఆమోద ముద్ర వేస్తే ఇక తిరుగేముంది? ఈ సినిమాలో కాజల్ ఎంపిక దాదాపుగా ఖాయమైపోయింది. అయితే చిత్రబృందం చివరి ప్రయత్నంగా రకుల్ ప్రీత్‌సింగ్‌ని సంప్రదించనున్నారు. రకుల్ కాల్షీట్లు దొరకడం గగనమైపోయిన నేపథ్యంలో ఆ అవకాశం చివరికి కాజల్‌కే దక్కే ఛాన్స్ ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



