సింగపూర్ టుస్సాడ్స్‌లో కాజల్ స్టాట్యూ
on Dec 17, 2019

తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ అమితానందంతో గాల్లో విహరిస్తోంది ఇప్పుడు. సాధారణంగా కాజల్ కళ్ళు చాలా పెద్దగా ఉంటాయి. ఇప్పుడు ఆనందంతో ఆ కళ్ళు మరింత పెద్దవిగా అయ్యాయి. ఇంత ఆనందానికి కారణం... ఈతరం దక్షిణాది యువ కథానాయికలలో ఎవరికీ దక్కని అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే... సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియంలో కాజల్ స్టాట్యూ త్వరలో పెట్టనున్నారు. మ్యూజియం నిర్వాహకులు కాజల్ అగర్వాల్ మెజర్మెంట్స్ తీసుకున్నారు. దక్షిణాది నుండి మహేష్ బాబుకు ఈ గౌరవం దక్కింది. సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన స్టాట్యూ పెట్టారు. అలాగే, అతిలోక సుందరి శ్రీదేవి స్టాట్యూ కూడా పెట్టారు. ఆమె స్టాట్యూ ఆవిష్కరణకు భర్త బోనీకపూర్, కుమార్తెలు జాన్వి, ఖుషి ఇతర కుటుంబ సభ్యులు వెళ్లారు. కాజల్ స్టాట్యూ వచ్చే ఏడాది ఫిబ్రవరి 5వ తారీఖున ఆవిష్కరించనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



