నాని చిత్రంలో కాజల్?
on Jun 18, 2021
ఒకవైపు కథానాయకుడిగా బిజీగా ఉంటూనే.. మరోవైపు నిర్మాతగానూ తనదైన ముద్ర వేస్తున్నారు నేచురల్ స్టార్ నాని. తాజాగా `మీట్ క్యూట్` పేరుతో తన నిర్మాణంలో కొత్త సినిమాని ప్రారంభించాడు నాని. ఈ చిత్రంతో నాని సోదరి దీప్తి ఘంటా దర్శకురాలిగా తొలి అడుగేస్తోంది. కాగా, ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్ నటిస్తున్నారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఆ ఐదుగురిలో ఒకరిగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కనిపించనుందట. నిర్మాతగా నాని మొదటి సినిమా అయిన `అ!`లోనూ కాజల్ ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకి విమర్శకుల ప్రశంసలతో పాటు పురస్కారాలు కూడా దక్కాయి. ఈ నేపథ్యంలో.. నాని - కాజల్ మరోసారి జట్టుకట్టనున్న వైనం ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కాజల్ చేతిలో `ఆచార్య`, `కింగ్` నాగార్జున - ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ మూవీ ఉన్నాయి. అలాగే `హే సినామిక`, `ఘోస్టీ`, డీకే డైరెక్టోరియల్, `ఇండియన్ 2` వంటి కోలీవుడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా `ఉమ` అనే బాలీవుడ్ మూవీలోనూ నటించబోతోందీ టాలెంటెడ్ యాక్ట్రెస్.
Also Read