విజయ్ దేవరకొండకి షాకిచ్చిన కేటీఆర్
on Jun 25, 2018
విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా యూత్ కి దగ్గరైపోయాడు.. అప్పటి నుండి విజయ్ ఏం చేసినా హాట్ టాపిక్.. స్టార్ హీరోలు నామినేషన్స్ లో ఉన్నా, బెస్ట్ యాక్టర్ గా ఫిలింఫేర్ అవార్డు అందుకొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు.. ఆ అవార్డుని సీఎం సహాయనిధికి ఇస్తానని ట్విట్టర్ ద్వారా కేటీఆర్ కు తెలియచేసి ఇంకాస్త ఆశ్చర్యపరిచాడు.. దానికి బదులుగా ట్విట్టర్ ద్వారా విజయ్ ని ప్రశంసించిన కేటీఆర్, ఇప్పుడు విజయ్ కి ఓ పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చారు.. ఆదివారం కేటీఆర్, విజయ్ ఇంటికెళ్లి ఫిలింఫేర్ అవార్డు సీఎం సహాయనిధికి ఇచ్చినందుకు అభినందించారు.. విజయ్ ఇంట్లో కాసేపు సరదాగా గడిపిన కేటీఆర్, విజయ్ కుటుంబంతో కలిసి భోజనం కూడా చేసారు.. ఈ విషయాన్ని 'మీ ఇంటికి మీ ఇష్టమైన నాయుడు లంచ్ కు వస్తే ఎలా ఉంటుంది' అంటూ విజయ్ తన ఆనందాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు.