ఫన్ కి కేర్ అఫ్ అడ్రస్ అనిల్ రావిపూడి
on Jun 16, 2022

అనిల్ రావిపూడి సినిమాలు చూస్తుంటే మరో లోకంలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు f 3 మూవీ హిట్ ఐన సందర్భంగా సెలెబ్రేషన్స్ చేసుకుంది. ఈ వేడుకల్లో రాఘవేంద్రరావు తన మనసులో మాటల్ని ఇలా అన్నారు. " నేను సినిమాకు రాసుకున్న ప్రేమలేఖ అనే ఒక పుస్తకాన్ని రాసుకున్నా. అందులో ఆఖరి పేజీలో సినిమా ఇలానే ఉండాలన్న రూల్ లేదు, గీత గీయోద్దు, సినిమా ఇలా కూడా ఉండొచ్చు అన్న రాసుకున్నాను. ఆ వాక్యాలను అనిల్ రావిపూడి నిరూపించి చూపించాడు.
ఈ f 3 మూవీలో హీరోకి కళ్ళు కనబడవు, ఇంకో హీరో మాట్లాడలేడు, హీరోయిన్లకేమో డబ్బు పిచ్చి.. ఇలాంటి అసాధ్యమైన ఎలిమెంట్స్ అన్నిటిని కలిపి మూవీని హిట్ చేసే ఫార్ములా ఒక్క అనిల్ కే తెలుసు. అనిల్ తీసే మూవీస్ ని ఎంజాయ్ చేయాలంటే ఖాళీ బుర్రతో వస్తే మాత్రం జేబు నిండుగా నవ్వుల్ని వేసుకుని వెళ్లొచ్చు అంటూ అనిల్ ని పొగడ్తలతో ముంచెత్తారు రాఘవేంద్ర రావు. ఖాళీ జేబన్నా ఉంటుంది కానీ ఖాళీ బుర్ర ఉండదు అంటూ ఒక మంచి మెసేజ్ ని ఈ సమాజానికి అందించావ్ అనిల్ అని అన్నారు. ఫ్రీగా వచ్చే డబ్బులు కన్నా క్రియేటివిటీకి పదును పెట్టి ఎంతైనా సంపాదించవచ్చు అనే ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ తో మంచి మూవీ తీసావ్ అంటూ అనిల్ భుజం తట్టారు. కోట్లు ఇవ్వకుండానే టాప్ స్టార్స్ అందరినీ ఈ మూవీలో పెట్టేసి పాన్ ఇండియా లెవెల్ లో మూవీ తియ్యడం చాలా గొప్ప విషయం అన్నారు. ఈ సందర్భంగా ఎంటైర్ టీంకి విషెస్ చెప్పారు రాఘవేంద్ర రావు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



