జ్యోతిక కొత్త సినిమా మొదలైంది!
on Jul 14, 2016
ప్రముఖ తమిళ కథానాయకి జ్యోతిక తమిళ కథానాయకుడు సూర్యను పెళ్లాడిన అనంతరం సినిమాలకు స్వస్తి పలికింది. ఇద్దరు పిల్లల తల్లయిన తర్వాత మళ్ళీ నటనపై మక్కువతో మొన్నామధ్య "36 వయాధినిలే" అనే ఓ సినిమాలో నటించింది. సూర్య నిర్మించిన ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వకపోయినప్పటికీ.. నటిగా జ్యోతికకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతోనే ఇప్పుడు మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా మొదలెట్టింది. నేషనల్ అవార్డ్ విన్నర్ బ్రహ్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ తాజా చిత్రం నేడు చెన్నైలో లాంఛనంగా మొదలైంది. జ్యోతికతోపాటు నిన్నటితరం నటీమణులైన భానుప్రియ, ఊర్వశి, శరణ్యలు కీలకపాత్రలు పోషించనున్న ఈ చిత్రాన్ని కూడా 2డి ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూర్య నిర్మించనున్నాడు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది!