ఇది విన్నారా...ఫిలింఫేర్ బాటలో ఎన్టీఆర్ పాట
on May 19, 2017
.jpg)
సంచలనాలు నమోదుచేయడం లో సాటిలేని కథానాయకుడిగా ఎదిగిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సత్తాను కన్నడలో చాటేస్తున్నాడు. కథానాయకుడిగా అనుకుంటున్నారా ...కాదు గాయకుడిగా తన స్వరంతో జయహో అనిపించుకున్నారు. కన్నడలో గతేడాది విడుదలైన హీరో పునీత్ రాజ్‌కుమార్ సినిమా 'చక్రవ్యూహ'చిత్రంలో ' గెలాయ గెలాయ' అంటూ సాగె పాటను ఆలపించాడు. ఎన్టీఆర్ పాడిన పాటను ప్రేక్షకులు ఆదరించారు. ఈ పాట గురించి సామాజిక మాధ్యమాలలో ఆయనకు అనేక ప్రశంసలు లభించాయి.
యమదొంగ చిత్రం తో గాయకుడిగా తన తొలి స్వరాన్ని వినిపించిన ఎన్టీఆర్ కన్నడీయులను ఈ పాటతో కనువిందు చేయడం అభిమానులలో రెట్టింపైన ఉత్సాహాన్ని నింపింది. ఈ పాటకు పట్టాభిషేకమే కాదు ఫిలింఫేర్ అవార్డుకు నామినేట్ కావడం మరింత ఊపును ఇచ్చినట్లయింది. గాయకుడిగా ఎన్టీఆర్ కు రాబోయే రోజుల్లో భలే అవకాశాలు దక్కనున్నట్లు తెలుస్తుంది. గాయకుడి విభాగంలో ఫిలింఫేర్ అవార్డుకు నామినేట్ కావడమే అయన సాధించిన గొప్ప విజయమని విమర్శకుల నుండి ప్రశంసలు పొందాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



