ఆస్కార్ నామినేషన్స్ లో జూనియర్ ఎన్టీఆర్!
on Aug 14, 2022

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేస్తాడు. ఎన్టీఆర్ ప్రతిభకు తగ్గ పాత్ర పడితే జాతీయ ఉత్తమ నటుడు అవార్డు సైతం సులభంగా వచ్చేస్తుందనేది తరచూ వినిపించే మాట. అయితే తారక్ కి నేషనల్ అవార్డు ఏంటి, ఆస్కార్ అవార్డు సైతం వచ్చే అర్హత ఉందంటూ హాలీవుడ్ మీడియా ఆకాశానికెత్తేస్తోంది.
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కొమురం భీమ్ పాత్రలో తారక్ జీవించిన విధానానికి అందరూ ఫిదా అయ్యారు. ముఖ్యంగా కొమురం భీముడో సాంగ్ లో ఆయన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అదే ఇప్పుడు ఎన్టీఆర్ నటన గురించి హాలీవుడ్ మీడియా మాట్లాడేలా చేసింది. 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఆస్కార్ బరిలో తారక్ నిలిచే అవకాశముందని ప్రముఖ మ్యాగజైన్ వెరైటీ అభిప్రాయపడింది. అంతేకాదు ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగాల్లో కూడా ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ నామినేషన్స్ లో అవకాశముందని రాసుకొచ్చింది.

ఎన్టీఆర్ ఆస్కార్ బరిలో నిలిచే అవకాశముందని ప్రముఖ మ్యాగజైన్ అభిప్రాయపడటంతో ఫ్యాన్స్ సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు తారక్ నటన గురించి మనకి మాత్రమే తెలిసిందని, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో వరల్డ్ వైడ్ గా తెలిసిందని ఆనందపడుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



